విశాఖలో పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ స్వర్ణలత, ఆమె ఖాకీ డ్రెస్సులో ఉన్న లేడీ మాఫియాడాన్ . పోలీసు అధికారి ముసుగులో దారుణమైన మోసాలకు పాల్పడి అక్రమంగా డబ్బులు సంపాదిస్తోంది. విచిత్రం ఏమిటంటే స్వర్ణలత ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా కూడా పదవిలో ఉంది. ఆమెపై చీటింగ్, బెదిరింపు , మోసం సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి.. ఆమె చంపేస్తామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా విచారణలో వెల్లడయ్యింది.
స్వర్ణలతతోపాటు హోంగార్డ్‌లు మెహర్, శ్రీను, బ్రోకర్ సూర్య అరెస్ట్ అయ్యారు. 2 వేలరూపాయల నోట్ల రద్దుని అడ్డంపెట్టుకొని డబ్బులు సంపాదించింది. నాకు 90 లక్షలు 500 రూపాయలు నోట్లు ఇస్తే, మీకు కోటిరూపాయలు విలువజేసే 2 వేలరూపాయల నోట్లు ఇస్తానంటూ , ఒక బ్రోకర్ సూర్య ద్వారా చీటింగ్ మరియు దందా వ్యాపారం మొదలుపెట్టింది. ఈమెతో బ్రోకర్ ద్వారా డీల్ కుదుర్చుకున్న వ్యక్తులు , 90 లక్షల డబ్బుతో వస్తుండగా , మధ్యలో ఈమె ఆధీనంలో ఉండే హోమ్ గార్డులు , ఆ వాహనం ఆపేస్తారు. చెక్ చేస్తున్నట్టు నటించి, కారులో 90 లక్షలు ఎక్కడివని దబాయించారు.
వాళ్ళను కొట్టి, కేసులేకుండా ఉండాలంటే డబ్బులిమ్మని , ఆమె స్వయంగా 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇదేదో ప్రీ ప్లాన్డ్ మోసం అని ఆ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే , ఈ మోసం బయటపడింది. దానివెనుక మహిళా పోలీస్ అధికారి ముఠా గుట్టు బట్టబయలైంది. దీంతో పోలీసులు ఆమెతో సహా , ముఠాలోని ఇతరులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్వర్ణలతపై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయట. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఈమెతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేసుకున్నారని చెబుతున్నారు. యూనిఫామ్‌లో వెళ్లి సివిల్ కేసుల సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. వ్యవహారచాలా స్టేషన్ దాకా రాకుండానే అనేక కేసులు క్లోజ్ చేసినట్లు విమర్శలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?
రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..
మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..
సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.