15 C
New York
Thursday, September 29, 2022

Buy now

సముద్ర గర్భంలో వున్న సొరంగంలో రైలు ఆగితే ?

రాత్రిళ్ళు రైలు రెండు స్టేషన్ల మధ్య నిర్మానుష్య ప్రాంతంలో ఆగితేనే మనకు భయం కలుగుతుంది.. కొండలనుంచి తొలిచిన సొరంగం లో ఆగితే , గుండె ఆగినంత పనౌతుంది.. అలాంటిది , ఏకంగా సముద్ర గర్భంలో వున్న సొరంగంలో రైలు ఆగితే , ఇంకేమైనా ఉందా..? అది బయలుదేరి గమ్యంచేరేదాకా ప్రాణాలు నీళ్లలోనే ఉంటాయి.. అలాంటిదే ఇది..

ఫ్రాన్స్‌లోని కలైస్ నుంచి ఇంగ్లండ్‌లోని ఫోల్కెస్టోన్ వెళ్తున్న రైలు ఇంగ్లిష్ చానల్ కింద ఒక్కసారిగా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందో? మళ్లీ ఎప్పుడు కదులుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దాదాపు ఐదారు గంటలపాటు ఉగ్గబట్టుకుని కూర్చున్నారు. చివరికి అత్యవసర సేవల ద్వారా వీరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అనంతరం మరో ట్రైన్ ద్వారా వారిని గమ్యస్థానాలకు చేర్చారు. మంగళవారం మధ్యాహ్నం 3.50 గంటలకు ఈ ఘటన జరిగింది.

యూరోటన్నెల్ లే షటిల్ సర్వీస్ రైలు అలారంలు ఒక్కసారిగా ఆఫ్ అవడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. బుధవారం ఉదయానికి తిరిగి సేవలు సాధారణ స్థితికి చేరుకున్నట్టు అధికారి ఒకరు తెలిపారు. రైలు అలారంలు మోగడం కారణంగా రైలు నిలిచిపోయిందని, దీనిపై దర్యాప్తు అవసరమని అన్నారు. ఇది చాలా అసాధారణమైన ఘటన అని అభివర్ణించారు. ఆ తర్వాత రైలును సొరంగం నుంచి నెమ్మదిగా బయటకు తీసుకొచ్చినట్టు చెప్పారు.

అండర్‌సీ టన్నెల్‌లో రైలు చిక్కుకుపోవడంపై బర్మింగ్‌హామ్‌కు చెందిన 37 ఏళ్ల సారా ఫెలోస్ మాట్లాడుతూ.. ఇదో భయంకరమైన అనుభవమని చెప్పారు. ఇదో డిజాస్టర్ సినిమాలా అనిపించిందని, ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులకు గురైనట్టు చెప్పారు. సముద్రం కింద అందరం క్యూ కట్టాల్సి వచ్చిందని పేర్కొంది. మరికొందరు భయంతో కన్నీళ్లు పెట్టుకున్నారని, ఇంకొందరు తీవ్ర భయాందోళనకు గురయ్యారని సారా చెప్పుకొచ్చింది. అండర్‌సీ టన్నెల్‌లో ప్రయాణికులు చిక్కుకుపోయిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

Related Articles

Stay Connected

22,042FansLike
3,503FollowersFollow
20,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles