5.7 C
New York
Thursday, November 30, 2023

Buy now

V2link Ads
Home Blog

శబరిమలబస్సు యాత్ర అలా వద్దు..కేరళ హైకోర్టు

0

అయ్యప్ప మాల వేసుకునే భక్తులు దాన్నొక కఠిన వ్రతంగా భావిస్తారు. తమ దీక్ష విరమించే ముందు శబరిమలై యాత్రకు పోతారు. చాలా గ్రామాలు , పట్టణాల్లో ఆధ్యాత్మిక ఇదొక సంబరంగా, జాతరగా ఉంటుంది. భక్తులు పోయే బస్సువరకు సాగనంపడం , బందు మిత్రులు పూలమాలలు వేయడం, కాళ్లకు మొక్కడం చేస్తారు. తమకు వేసిన పూలమాలలు భక్తులు బస్సుచుట్టూ కడతారు. బస్సుకు ముందు తమ యాత్రను తెలిపే బ్యానర్ ఒకటి కడతారు. .. ఇలా శబరిమల యాత్ర హంగామాకు ఇక ఫుల్ స్టాప్ పడింది.

శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ హైకోర్టు ముఖ్యమైన సూచన చేసింది. సొంత వాహనంలో శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు తమ వాహనాలకు ఎటువంటి అలంకరణలు చేయొద్దని పేర్కొంది. ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.

వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూవులు, మాలలు అలంకరించడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇలా చేయడం మోటరు వాహనాల నిబంధనలకు కూడా విరుద్ధమని కేరళ హైకోర్టు పేర్కొంది. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని అందజేశారు.

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది..?

0

రాజమండ్రి సెంట్రల్ జైల్లో అసలేం జరుగుతోంది..? టీడీపీ అధినేత చంద్రబాబుకు లీగల్ ములాఖత్ ఎందుకు రద్దు చేశారు..? రాజమండ్రి జైల్లో చంద్రబాబు చేస్తున్న న్యాయ పోరాటంలో జాప్యానికి ఏదైనా కుట్ర జరుగుతోందా..? ఎన్నో ప్రశ్నలు.. పొంతనలేని సమాధానాలు..

స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఆయన భద్రత విషయం, సౌకర్యాల కల్పన విషయంలో ఇప్పటికే అనేక అనుమానాలను కుటుంబ సభ్యులు వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు లీగల్ ములాఖత్ కూడా రద్దు చేశారు. రోజూ రెండు సార్లు లీగల్ ములాఖత్ కు అవకాశం ఉండగా, భద్రతా కారణాలతో జైలు అధికారులు ఈ ములాఖత్ ను రద్దు చేశారు. కేవలం ఒక్క ములాఖత్ మాత్రమే అనుమతిస్తూ ఆదేశాలు జరీ చేశారు.

లీగల్ ములాఖత్ కోసం చంద్రబాబు నాయుడు స్నేహ బ్లాక్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కు వచ్చేటప్పుడు మిగతా ఖైదీలు ఇబ్బందులు పడుతున్నారని.. భద్రతా పరమైన కారణాల వలన లీగల్ ములాఖత్ కుదించినట్టు లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా దాదాపుగా 2 వేల మంది ఖైదీలు ఉంటున్న ఈ జైల్లో ఖైదీలను కోర్టులో హాజరుపరచడంలో కూడా ఆలస్యం జరుగుతోందని ఇది కూడా ఒక కారణమని లేఖలో వివరించారు.

అయితే జైలు సిబ్బంది విడుదల చేసిన లేఖపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. కావాలనే చంద్రబాబు నాయుడుకు లీగల్ ములాఖత్ రద్దు చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. ఐదు వారాలుగా లేని భద్రతా కారణాలు ఇప్పుడెందుకు చెబుతున్నారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబుకు న్యాయ సహాయం అందకుండా ఉండేందుకే కుట్ర చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. కనీసం అనారోగ్యానికి గురైతే ఆసుపత్రికి కూడా పంపలేదని గుర్తు చేస్తున్నారు.

రాజమండ్రి జైలు సిబ్బంది చంద్రబాబు విషయంలో ఇలా వ్యవహరిస్తుంటే.. అసలు జైలు లోపల ఏం జరుగుతోందని టీడీపీ సామాన్య కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు. చంద్రబాబు ఎలా ఉన్నారో.. తెలియక కుటుంబ సభ్యులు సైతం మధనపడుతున్నారు.

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

అతడు లేడీస్ ని చూస్తేనే వణికిపోతాడు.అదో జబ్బు.

0

చీకటి అంటే చాలామందికి భయం. అలాగే బల్లులు, బొద్దింకలన్నా కూడా కొంతమందికి భయం. అయితే మహిళలను చూసి భయపడేవాళ్లు, వాళ్ళకి దూరంగా 55 సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఉన్నాడు. మహిళలకు దూరంగా ఇంటి చుట్టూ 15 అడుగులు ఎత్తు ప్రహరీ గోడ కట్టుకుని ఒక్కడే ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు . అతడి పేరు జమ్విత. రువాండాలో ఉంటున్నాడు. ఇతడు గత 55 సంవత్సరాలుగా తనకు తాను ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని ఇంట్లో ఒక్కడే ఉండిపోయాడు .

పదహారేళ్ళ వయసులో ఇంట్లో తనను తాను బంధించుకుని ఆడవాళ్లు వస్తే మూల దాక్కునేవాడు . అలా మొదలైన అతని భయం చివరకు ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తు కంచి వేసుకుని మహిళలు ఎవరు రాకుండా ఒక్కడే ఇంటిలోనే ఉంటున్నాడు. దగ్గరకు పోవాలని అతనిని పిలిచి మాట్లాడాలని, ఇంటి చుట్టుపక్కల మహిళలు ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కావడం లేదు. మహిళల గొంతు వింటేనే లోపలే ఉండిపోతాడు. బయట కూడా రాడు. ఒకవేళ ఎవరూ లేరు అనుకుని ఇంటి బయట తిరుగుతున్న సమయంలో మహిళలు ఎవరైనా కంచె పైనుంచి చూస్తే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు.

ఇతని పరిస్థితి చూసి చాలామంది మహిళలు ఇంటి చుట్టుపక్కల వారు అతనికి కావలసిన ఆహారాన్ని ఈ 55 సంవత్సరాలు ప్రతిరోజు ఎవరో ఒకరు కంచె ఆవల నుంచి విసిరేస్తుంటారు. మహిళలు తనను చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే అతడు బయటికి వచ్చి ఆహారాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మగవాళ్ళతో చూసి మాట్లాడుతాడు తప్ప బయటకు రాడు అదే సమయంలో ఆడవాళ్ళు గనుక కనిపిస్తే మళ్లీ లోపలికి వెళ్ళిపోతాడు.

ఇతనికి ఇది చిన్ననాటి నుంచి పెరిగిన మానసికమైన జబ్బు అని వైద్యులు నిర్ధారించారు. దీన్ని మానసిక శాస్త్రంలో గైనోపోబియా అంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి మహిళలను చూస్తే ఇరిటేషన్ ఫీల్ అవుతాడు.ఒక రకమైన భయం కలుగుతుంది. వాళ్లను చూస్తే ఆందోళన పెరుగుతుంది. ఇరిటేషన్ కలుగుతుంది. ఒకవేళ మహిళలు ఇతని సమీపించాలని ప్రయత్నం చేస్తే అది హార్ట్ ఎటాక్ దారి తీయవచ్చునని, కండరాలు బిగుసుకుపోవచ్చునని ,చెమటలు పట్టి శరీరం వణికి పోవచ్చునని కండరాలు బిగుసుకుపోవచ్చునని, ఆందోళనలో శ్వాస పీల్చుకోవడం కూడా కష్టం కావచ్చు నని డాక్టర్లు చెప్పారు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ గైనోబియా వ్యాధితో బాధపడే వాళ్ళలో ఒకే ఒక్కడు అతడే జీవితం జంబిత..

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

అమిత్ షా, సుకన్య ఎవరని లోకేష్ ని అడిగారట ..

0

ట్విట్టర్ వచ్చిన తరువాత అదే వేదికగా రాజకీయాల్లో పదాల యుద్ధం మొదలయింది.చిట్టి పొట్టి విమర్శలతో మాటకు మాట, తిట్టుకు తిట్టు, విమర్శకు , ప్రతి విమర్శ .. ఇలా జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసిపి, టిడిపి నేతలమధ్య ఈ ట్విట్టర్ వార్ ఆసక్తికరంగా ఉంది.. మీరే చూడండి..

లోకేష్, హోమ్ మంత్రి అమిత్ షా ని కలిసినప్పుడు , హేళనగా వైసిపి ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పెట్టిన ట్వీట్ ఇది.. ఆ తరువాత దానికిందనే అయ్యన్నపాత్రుడు మరింత హేళనగా పెట్టిన ట్వీట్.. రెండూ భలే రంజుగా ఉన్నాయి..

ఇక్కడ చూడండి, లోకేష్ అమిత్ షాని కలిసింది , టిడిపి ని బీజేపీలో విలీనానికా అని ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేస్తే , కాదు సుకన్య ఎవరో కనుక్కోండి అని అడిగారని అయ్యన్నపాత్రుడు రీ ట్వీట్ చేశారు.. ఇలా ఉంది వాళ్ళ ట్విట్టర్ వార్ .

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

 

రాజకీయాల్లో పవన్ వైపే..రేణూదేశాయ్

0

ఏపీ రాజ‌కీయాల్లో బ్రో సినిమా వివాదం పెద్ద దుమారాన్నే రేపింది. అందులో శ్యాంబాబు క్యారెక్ట‌ర్, ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబుని ఉద్దేశించి సృష్టించింద‌ని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ, ప‌వ‌న్ పై తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. దీంతోపాటు ప‌వ‌న్ వైవాహిక జీవితంపై సినిమా తీస్తామని కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ స్పందిస్తూ త‌న ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని రిలీజ్ చేసింది. త‌మ పిల్ల‌ల‌ను అన‌వ‌స‌రంగా రాజ‌కీయాల్లోకి లాగ‌కండి అంటూ ఉద్దేశించిన ఈ వీడియో వైర‌ల్ అవుతోంది.

విదేశాల్లో ఉన్న త‌న‌కు ప్ర‌స్తుతం రాజ‌కీయాల్లో జ‌రుగుతున్న ప‌రిణామాలు తెలియ‌లేద‌ని, అయితే తిరిగొచ్చిన త‌ర్వాత కొన్ని విష‌యాలు తెలిసాయ‌ని చెప్పుకొచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలపై ఓ చిత్రం తీస్తున్నారన్న వార్తలు తనను చాలా బాధిస్తున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాలు హుందాగా చేసుకోవాల‌ని, వ్య‌క్తిగ‌త అజెండాల‌తో కుటుంబాల‌పై రుద్దే ప్ర‌య‌త్నం చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ఆడ‌వాళ్ళ‌ను, పిల్ల‌ల‌ను అన‌వ‌స‌రంగా రాజ‌కీయాల్లో లాగొద్ద‌ని, వీటితో త‌మ‌కు ఏమైనా సంబంధం ఉందా అని ప్ర‌శ్నించారు.

మా పిల్ల‌లు సినీనేప‌ద్యం ఉన్న కుటుంబంలో పుట్టార‌ని చెప్పారు. ప‌వ‌న్ నా బిడ్డ‌ల‌కు తండ్రి అని, న‌టుడు, అలాగే రాజ‌కీయ నాయ‌కుడ‌ని అన్నారు. రాజ‌కీయంగా త‌న మ‌ద్ద‌తు ప‌వ‌న్ కే ఉంటుంద‌న్నారు. ఆయన మనీ మైండెడ్ కాదని, స‌మాజం బాగు కోసం ప‌ని చేయాల‌నుకుంటున్నార‌ని చెప్పారు. ఆయ‌న రాజ‌కీయాల్లో ఉన్నంత‌మాత్రాన‌, విమ‌ర్శించ‌డానికో, ప్ర‌తిష్ట‌ను దెబ్బ‌తీయ‌డానికో, పవన్ వైవాహిక‌ జీవితం, పిల్ల‌ల‌పై సినిమా తీస్తామని హెచ్చ‌రించ‌డం స‌రికాద‌న్నారు. నా బిడ్డ‌ల తల్లిగా, నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నాన‌ని రాజ‌కీయాల్లోకి త‌మ‌ని లాగొద్ద‌ని అభ్య‌ర్ధించారు.

https://www.instagram.com/reel/Cvwkpwwo5zG/?utm_source=ig_web_button_share_sheet

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

ఈ ఏడాది రాఖీ ఆ టైంలోనే రాఖీ కట్టాలి.

0

ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడన్న విషయమై సంశయం నెలకొనింది. ప్రతి ఏడాది లేని డోలాయమానానికి కారణం శ్రావణ పౌర్ణమి ముందురోజు మొదలై , మరుసటి రోజువరకు కొనసాగడమే.. దీనికి తోడు భద్ర కాలం రావడంతో , చివరకు రాఖీలు కట్టే సమయం పండితులు నిర్ణయించేసారు. అదెప్పుడో చూడండి. అన్నాచెల్లెల అనుబంధానికి, అక్కాత‌మ్ముల ప్రేమానురాగానికి ప్ర‌తిరూప‌మే రాఖీ ప‌ర్వ‌దినం, ఈ పండుగ వ‌స్తుందంటే చాలు..

సోద‌ర సోద‌రీమ‌ణులు ఎంతో ఆత్రుత‌తో ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. సోద‌రుడుకి రాఖీని క‌ట్టి త‌మ అనుబంధాన్ని మ‌రింత ప‌దిలం చేసుకుంటారు. ప్ర‌తిఏడాది శ్రావ‌ణ‌మాసంలో పూర్ణిమనాడు రాఖీ ప‌ర్వ‌దినాన్ని జ‌రుపుకోవ‌డం సంప్ర‌దాయం. అయితే ఈ పూర్ణిమ రెండు రోజులు రావ‌డంతో, ఏరోజు రాఖీ పండుగ జ‌రుపుకోవాల‌ని సంశ‌యం చాలామందిలో నెల‌కొంది. ఈనెల 30, 31 తేదీల్లో పూర్ణిమ వ‌చ్చింది. 30వ తేదీ పూర్ణిమ నాడు భ‌ద్ర‌కాలం ఉంది.

చెడు కాలాన్ని భ‌ద్ర‌కాలం అని వ‌ర్ణిస్తుంటారు. ఆ స‌మ‌యంలో సోద‌రుడికి రాఖీ క‌డితే అరిష్ట‌మ‌ని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్రకాలం ఉంటుంద‌ని, ఆ సమయంలో రాఖీ కూడా కట్టకూడదని అంటున్నారు.

30వ తేదీ రాత్రి 9గంట‌ల 1 నిమిషం నుంచి 31వ తేదీ ఉద‌యం 7 గంట‌ల 5 నిమిషాలలోపు రాఖీ క‌ట్టించుకోవడం ఉత్త‌మని, అది శుభ‌కాల‌మ‌ని చెబుతున్నారు. అందువల్ల రాఖీలు కట్టేవారు ఈ సమయాన్ని జాగ్రత్తగా పాటించమని చెబుతున్నారు..

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

పొట్టకూటికోసం గల్ఫ్ దేశాలలో మనవాళ్ళు.

0

విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు మెుత్తం ఒక కోటి 34 లక్షలమంది , వీరిలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 88 లక్షల 8 వేలు..అందులో కువైట్ లో 10లక్షల పైచిలుకు భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్‌లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది.

ఈ డేటా మార్చి 2022 నాటి వరకు ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.మన భారతీయులు 210 దేశాల్లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్‌లో 10.2 లక్షలు, ఖతార్‌లో 7.4 లక్షలు, ఒమన్‌లో 7.7, బహ్రెయిన్‌లో 3.2 లక్షల మంది ఉన్నారు.

RTI ప్రత్యుత్తరం ప్రకారం, అమెరికాలో 12. లక్షల 8 వేలమంది మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. బ్రిటన్ లో మూడున్నర లక్షలు, ఆస్ట్రేలియాలో 2. లక్షల 40వేలు , మలేషియాలో 2. లక్షలు 20వేలు , కెనడాలో 1 లక్ష 70వేలమంది ఉన్నారు.

అలాగే 31 లక్షల మంది, ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికంగా పీఐఓఎస్‌లు ఉన్నాయని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27. లక్షలు, మయన్మార్‌లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15. లక్షల మంది ఉన్నారు..

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

 

విశాఖలో పోలీస్ లేడీ డాన్ స్వర్ణలతపై కేసు

0

విశాఖలో పోలీస్ శాఖలో రిజర్వ్ ఇన్స్‌పెక్టర్ స్వర్ణలత, ఆమె ఖాకీ డ్రెస్సులో ఉన్న లేడీ మాఫియాడాన్ . పోలీసు అధికారి ముసుగులో దారుణమైన మోసాలకు పాల్పడి అక్రమంగా డబ్బులు సంపాదిస్తోంది. విచిత్రం ఏమిటంటే స్వర్ణలత ఆంధ్రా పోలీస్ ఆఫీసర్ల సంఘానికి ఉపాధ్యక్షురాలిగా కూడా పదవిలో ఉంది. ఆమెపై చీటింగ్, బెదిరింపు , మోసం సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి.. ఆమె చంపేస్తామని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసినట్లుగా విచారణలో వెల్లడయ్యింది.

స్వర్ణలతతోపాటు హోంగార్డ్‌లు మెహర్, శ్రీను, బ్రోకర్ సూర్య అరెస్ట్‌ అయ్యారు. 2 వేలరూపాయల నోట్ల రద్దుని అడ్డంపెట్టుకొని డబ్బులు సంపాదించింది. నాకు 90 లక్షలు 500 రూపాయలు నోట్లు ఇస్తే, మీకు కోటిరూపాయలు విలువజేసే 2 వేలరూపాయల నోట్లు ఇస్తానంటూ , ఒక బ్రోకర్ సూర్య ద్వారా చీటింగ్ మరియు దందా వ్యాపారం మొదలుపెట్టింది. ఈమెతో బ్రోకర్ ద్వారా డీల్ కుదుర్చుకున్న వ్యక్తులు , 90 లక్షల డబ్బుతో వస్తుండగా , మధ్యలో ఈమె ఆధీనంలో ఉండే హోమ్ గార్డులు , ఆ వాహనం ఆపేస్తారు. చెక్ చేస్తున్నట్టు నటించి, కారులో 90 లక్షలు ఎక్కడివని దబాయించారు.

వాళ్ళను కొట్టి, కేసులేకుండా ఉండాలంటే డబ్బులిమ్మని , ఆమె స్వయంగా 15 లక్షలు తీసుకొని వెళ్ళిపోయింది. ఇదేదో ప్రీ ప్లాన్డ్ మోసం అని ఆ వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేస్తే , ఈ మోసం బయటపడింది. దానివెనుక మహిళా పోలీస్ అధికారి ముఠా గుట్టు బట్టబయలైంది. దీంతో పోలీసులు ఆమెతో సహా , ముఠాలోని ఇతరులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. స్వర్ణలతపై ఇదివరకు కూడా ఆరోపణలు ఉన్నాయట. కొంతమంది పోలీసు అధికారులు కూడా ఈమెతో కుమ్మక్కై సెటిల్మెంట్లు చేసుకున్నారని చెబుతున్నారు. యూనిఫామ్‌లో వెళ్లి సివిల్‌ కేసుల సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. వ్యవహారచాలా స్టేషన్‌ దాకా రాకుండానే అనేక కేసులు క్లోజ్‌ చేసినట్లు విమర్శలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

 

కొత్తలుక్ లో 2024 కియా కారు వచ్చేస్తుంది.

0

కొత్తలుక్ లో 2024 కియా కారు వచ్చేస్తుంది. 14 నుంచి 15.65 లక్షల రూపాయల లోపు వచ్చే ఏడాది జూన్ కల్లా ఈ కారు ఇండియాలో అమ్మకానికి రెడీ అవుతుంది. దీన్ని గ్రాండ్ I ప్లాట్ఫారం పై సిద్ధంచేశారు. 1. 2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో , ఆటోమాటిక్ గేర్ బాక్స్ ఆప్షన్ తో ఈ కారు మార్కెట్ లోకి వస్తుంది. మోడల్స్ ని బట్టి , 14 నుంచి 15.65 రూపాయల లోపు దీని ధర ఉంటుంది.

ఇన్సూరెన్స్, లైఫ్ టాక్స్ , ఇతర ఖర్చులు కలిపి మరో లక్ష అవుతాయి. కియా పికాంటో కారులో ప్రత్యేకమైన సదుపాయాలను ప్రవేశపెట్టారు. హై ఎండ్ డిజైన్ లో మాత్రమే కనిపించే స్టయిలిష్ ఫ్రంట్ గ్రిల్ అమర్చారు. వీటితో పాటుగా ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్, సర్కులర్ ఫాగ్ లాంప్స్, ప్రత్యేక క్యాబిన్ డిజైన్, టచ్ స్క్రీన్ నావిగేషన్ సిస్టం, బ్లూటూత్ కనెక్షన్ కూడా పికాంటోలో పొందుపరిచారు.

మరీ ముఖ్యంగా కారులో ప్రయాణించేవారి సేఫ్టీ కోసం 7 ఎయిర్ బాగ్స్ కూడా ఇందులో ఉన్నాయి. ప్రధానంగా ఈ కారు మారుతీ స్విఫ్ట్, హ్యుండై గ్రాండ్ ఐ 10 కి పోటీగా తీసుకొస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

 

భర్తలు చేసే ఫిర్యాదులు విచారణకు తీసుకోండి..

0

జాతీయ మహిళా కమిషన్ మాదిరి జాతీయ పురుషుల కమిషన్ ని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయమూర్తులు తిరస్కరించారు. గృహహింస ,అత్యాచారాలు లాంటి చర్యలు మహిళల మీదనే కాదని, పురుషుల మీద కూడా జరుగుతున్నాయి అంటూ ఓ వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

పురుషులు కూడా మహిళల చేతుల్లో చాలా చిత్రహింసల గురవుతున్నారని ఆ బాధలు పడలేక చాలామంది జీవితాలు చాలించుకుంటున్నారని, అందువల్ల మహిళల మాదిరి పురుషులకు కూడా ఒక పురుష కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషన్ వేశారు. అందరికీ సమాన న్యాయం అనేది రాజ్యాంగం మౌలిక స్ఫూర్తి అని అలాగే మహిళలకు రక్షణకు ఎటువంటి చట్టాలు ఉన్నాయో పురుషుల రక్షణ కూడా అలాంటి చట్టాలే అమలు పరచాలని కోరారు. ఇందుకు సంబంధించి దేశంలో భర్తలపై లేదా పురుషులపై జరిగిన అనేకమైన సంఘటనలు ఉదహరించారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్ మరియు దీపాంకర్ దత్త విచారణ జరిపి ఈ పిటిషన్ విచారణకు స్వీకరించలేమని కొట్టివేశారు. మహేష్ కుమార్ తివారి అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు. ఇతను అడ్వకేట్ గా పనిచేస్తున్నారు. 2021 నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెలువరించిన జాబితా ఆధారంగా ఆయన కొన్ని గణాంకాలు కూడా ఇచ్చాడు. దేశం మొత్తం మీద 1,643 మంది బలవన్మరణాలకు పాల్పడితే అందులో 81 వేల 63 మంది పురుషులు ఉన్నారని, 28,680 మంది మాత్రమే వివాహితులైన మహిళలు ఉన్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని బట్టి పురుషులే గృహహింసను తట్టుకోలేక జీవితాలు చాలించుకుంటున్నారని కూడా ఆయన వాదించారు. ఈ ఒక్క సంవత్సరమే దేశవ్యాప్తంగా ఒక లక్ష 1879 మంది పురుషులు బలవన్మరణం పొందారని వివరించారు.

అందువల్ల దేశంలో పురుషుల పట్ల ఎలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయో వీటికి కారకులెవరు విచారించేందుకు జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలన్నది ఆయన వాదన. అయితే ఈ పిటిషన్ న్యాయమూర్తులు కొట్టివేశారు. అయితే గుడ్డిలో మెల్లగా , దేశంలో భర్తలు , భార్యలపై చేసే ఫిర్యాదులను విచారణకు స్వీకరించమని ఆదేశాలు ఇవ్వాలని కేంద్రాన్ని కోర్టు కోరింది. జాతీయ పురుషుల కమీషన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు న్యాయ కమీషన్ ని కోరాలని కూడా సూచించింది..

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.