ఏపీ రాజకీయాల్లో బ్రో సినిమా వివాదం పెద్ద దుమారాన్నే రేపింది. అందులో శ్యాంబాబు క్యారెక్టర్, ఏపీ మంత్రి అంబటి రాంబాబుని ఉద్దేశించి సృష్టించిందని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తూ, పవన్ పై తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దీంతోపాటు పవన్ వైవాహిక జీవితంపై సినిమా తీస్తామని కూడా ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ స్పందిస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియోని రిలీజ్ చేసింది. తమ పిల్లలను అనవసరంగా రాజకీయాల్లోకి లాగకండి అంటూ ఉద్దేశించిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
విదేశాల్లో ఉన్న తనకు ప్రస్తుతం రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు తెలియలేదని, అయితే తిరిగొచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలిసాయని చెప్పుకొచ్చారు. పవన్ మూడు పెళ్లిళ్లు, నలుగురు పిల్లలపై ఓ చిత్రం తీస్తున్నారన్న వార్తలు తనను చాలా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలు హుందాగా చేసుకోవాలని, వ్యక్తిగత అజెండాలతో కుటుంబాలపై రుద్దే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఆడవాళ్ళను, పిల్లలను అనవసరంగా రాజకీయాల్లో లాగొద్దని, వీటితో తమకు ఏమైనా సంబంధం ఉందా అని ప్రశ్నించారు.
మా పిల్లలు సినీనేపద్యం ఉన్న కుటుంబంలో పుట్టారని చెప్పారు. పవన్ నా బిడ్డలకు తండ్రి అని, నటుడు, అలాగే రాజకీయ నాయకుడని అన్నారు. రాజకీయంగా తన మద్దతు పవన్ కే ఉంటుందన్నారు. ఆయన మనీ మైండెడ్ కాదని, సమాజం బాగు కోసం పని చేయాలనుకుంటున్నారని చెప్పారు. ఆయన రాజకీయాల్లో ఉన్నంతమాత్రాన, విమర్శించడానికో, ప్రతిష్టను దెబ్బతీయడానికో, పవన్ వైవాహిక జీవితం, పిల్లలపై సినిమా తీస్తామని హెచ్చరించడం సరికాదన్నారు. నా బిడ్డల తల్లిగా, నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నానని రాజకీయాల్లోకి తమని లాగొద్దని అభ్యర్ధించారు.
https://www.instagram.com/reel/Cvwkpwwo5zG/?utm_source=ig_web_button_share_sheet
ఇవి కూడా చదవండి..