విదేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు మెుత్తం ఒక కోటి 34 లక్షలమంది , వీరిలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య 88 లక్షల 8 వేలు..అందులో కువైట్ లో 10లక్షల పైచిలుకు భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులలో 66 శాతానికి పైగా గల్ఫ్ దేశాలైన యుఎఇ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్ మరియు బహ్రెయిన్‌లలో ఉన్నారని విదేశాంగ మంత్రిత్వ శాఖ RTI సమాధానంలో తెలిపింది.
ఈ డేటా మార్చి 2022 నాటి వరకు ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది.మన భారతీయులు 210 దేశాల్లో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో 34.1 లక్షల మంది ఎన్నారైలు నివసిస్తుండగా, సౌదీ అరేబియాలో 25.9 లక్షలు, కువైట్‌లో 10.2 లక్షలు, ఖతార్‌లో 7.4 లక్షలు, ఒమన్‌లో 7.7, బహ్రెయిన్‌లో 3.2 లక్షల మంది ఉన్నారు.
RTI ప్రత్యుత్తరం ప్రకారం, అమెరికాలో 12. లక్షల 8 వేలమంది మంది ఎన్నారైలు నివసిస్తున్నారు. బ్రిటన్ లో మూడున్నర లక్షలు, ఆస్ట్రేలియాలో 2. లక్షల 40వేలు , మలేషియాలో 2. లక్షలు 20వేలు , కెనడాలో 1 లక్ష 70వేలమంది ఉన్నారు.
అలాగే 31 లక్షల మంది, ఇతర దేశాలతో పోల్చితే అమెరికాలోనే అత్యధికంగా పీఐఓఎస్‌లు ఉన్నాయని ఆర్టీఐ సమాధానంలో పేర్కొంది. ఆ తర్వాత మలేషియాలో 27. లక్షలు, మయన్మార్‌లో 20 లక్షలు, శ్రీలంకలో 16 లక్షలు, కెనడాలో 15. లక్షల మంది ఉన్నారు..
ఇవి కూడా చదవండి..
ఆమె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?
రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..
మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..
సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.