5.7 C
New York
Thursday, November 30, 2023

Buy now

V2link Ads

ముద్రగడ విమర్శలు పవన్ కి వరాలయ్యాయి.

V2link Ads

కాపు కులంలో ముసలం పుట్టిందా? రానున్న ఎన్నికల్లో కాపు కులాన్ని తురుపు మొక్కగా వాడి ప్రయోజనం పొందాలన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలు చేస్తున్న జిమ్మిక్కులు ,చదరంగపు క్రీడలో ఎవరు నెగ్గారు..? ఎవరు వైపు కాపులు ఉన్నారు..? ఎవరిని కాపులు నమ్ముతున్నారు..? ఇప్పుడు ఇదే అంతు పట్టని ప్రశ్న. ఒకరకంగా చెప్పాలంటే గత పది రోజులుగా ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాపుల్లో వంగవీటి మోహన రంగా తర్వాత ఒక ప్రముఖమైన వ్యక్తి ముద్రగడ పద్మనాభం. కాపు ఉద్యమాల పేరుతో ముద్రగడవు పద్మనాభం ఆ కులంలో ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. రాజకీయాలు ఎలా ఉన్నా ముద్రగడ పద్మనాభంకు సాత్వికుడు, ఉద్యమకారుడు, కాపు కుల పక్షపాతి అన్న పేరు ఉండేది .

అయితే ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇబ్బందుల్లో పడ్డారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎన్నడూ ఎరగని రీతిలో సొంత కులస్తుల నుంచి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన విమర్శనాస్త్రాలే ముద్రగడ పద్మనాభాన్ని ఇప్పుడు కష్టాల్లోకి నెట్టేసాయి. కాపు కులస్తులు ఆయనను రాజకీయ కాష్టం మీదకు చేర్చేశారు. నీచంగా తిడుతున్నారు. ఆయన మీద ఇప్పుడు వస్తున్న ట్రోల్స్ బహుశా ఆయన జీవితంలో ఎప్పుడు చూసి ఉండరు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పై పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకు ముందే చంద్రశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని , నీచమైన పదజాలంతో అసభ్యంగా తిట్టారు . అప్పుడు నోరెత్తని పద్మనాభం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా , ద్వారంపూడికి మద్దతుగా నిలవడమే కాదు, పవన్ కళ్యాణ్ను కించపరుస్తూ ఆయన నాయకత్వాన్ని బలహీన పరుస్తూ మాట్లాడారు. కనీసం ఆయన జనసేన అధ్యక్షుడని సంప్రదించకుండా పవన్ కళ్యాణ్ కు ముద్రగడ రాసిన లేఖలో ఒక ప్రముఖ నటుడు అంటూ సంబోధించడం కూడా వివాదాస్పదమయింది.

ముద్రగడ పద్మనాభం హేళనగా , చులకనగా పవన్ కళ్యాణ్ కు రాసిన లేఖలో కించపరిచే భాష వాడడంతో కాపు కులస్తుల్లో ఆగ్రహం పెల్లుబుకింది. విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా ఉపయోగపడాలనుకున్న ముద్రగడ ఎత్తుగడ ఇప్పుడు బెడిసి కొట్టింది. ఇప్పుడు అసలుకే మోసం వచ్చింది. పవన్ కళ్యాణ్ కు ఊహించనంతగా కాపుల నుంచి సానుభూతి లభించింది. . కాపుల కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా మాట్లాడిందేమీ లేకపోయినా, ఆయన ఇచ్చిన హామీలు లేకపోయినా, కాపుల కోసం తాను ఉద్యమం చేస్తానని ఆయన చెప్పకపోయినా, ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ పై విపరీతమైన అభిమానం పెరిగింది.

బహుశా ముద్రగడ పద్మనాభం తిట్ల తర్వాతనే ఇది మరీ ఎక్కువైంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు ఉత్తరాంధ్ర కోనసీమ ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన సభలు విజయవంతం అయ్యాయి. గతంలో మాదిరి ఆయన ఫ్యాన్స్ తోనే ర్యాలీలు సభలు ఇప్పుడు జరగడం లేదు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన చేస్తున్న ఈ ర్యాలీలు ఈ సభలకు జనం నీరాజనం పట్టారు.. ఒకరకంగా ఈ ధోరణి , రాజకీయంగా వైసిపిని ఆత్మరక్షణలో పడేసిందనడంలో అనుమానం లేదు..

ఇవి కూడా చదవండి..

మె పిలిచింది. ఉన్నవన్నీ వలిచేసింది.చివరకు.?

రాజమండ్రి కేటుగాడు.వలవేస్తే చిక్కాల్సిందే..

మొక్కుతీర్చడంలో వీళ్లభక్తి చూసి ఏడుకొండలవాడే ఆలోచనలో పడిఉంటాడు..

సిగ్గువిడిచిన తారలలో ఉర్ఫీజవేద్ ఒకటి.. ఇప్పుడిది లేటెస్ట్ రోడ్ షో.. చూసేయండి.

 

V2link Ads

Related Articles

Stay Connected

0FansLike
3,912FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -

Latest Articles