మొబైల్ ఫోన్ల వినియోగం పిల్లల పైనే కాదు తల్లిదండ్రుల పై కూడా విపరీత ప్రభావాన్ని చూపిస్తుంది. కొంతమంది తల్లులు మొబైల్ ఫోన్ పిచ్చిలో పడి బిడ్డను వదిలేసిన ఉదంతాలు కోకొల్లలు. అలాంటిదే ఇది , ఓ తల్లి తన బిడ్డను వాకర్ లో నుంచి తీసి చేతి చేతిలో పట్టుకుంది. మొబైల్ ఫోన్ చూస్తూ బిడ్డని వాకర్ లోంచి తీసి తన చేతుల్లోనే ఉంచుకున్న విషయం మర్చిపోయింది .. ఫోన్ లో మైకంలో మరచి పోయింది.. ఒక్కసారిగా వాకర్ లో చూడగానే బిడ్డ లేకపోయేసరికి ఆందోళనతో ఫోన్ విసిరేసి, చేతిలోనే ఉన్న బిడ్డ కోసం ఇంట్లో వెతికింది . ఆ తర్వాత గుర్తుకు వచ్చినట్టు ఉంది తన చేతుల్లోనే ఉన్నాడని ,ఆ వెంటనే ఉలిక్కిపడి అటు ఇటు చూసుకుని సంతోషంతో మళ్ళీ ఫోన్ చేతిలోకితీసుకుని యధాప్రకారం పోన్లోనే మునిగిపోయింది.
ఫోన్ పిచ్చిలో తల్లిదండ్రులు పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారు , దానికి ఇదే ఉదాహరణ.. కొంతమందైతే తమ బిడ్డలు నిద్రపోక పోయినా, అన్నం తినకపోయినా , లేదా తాము ఫోన్ చూడాలనుకున్నా, పిల్లలలకు మొబైల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో ఎన్నో అనర్థాలకు దారితీసే అవకాశం ఉంది. మొబైల్ ఫోన్ పిచ్చిలో పడి పిల్లలను పట్టించుకోని భార్య భర్తలు, ఒకే గదిలో , ఒకటే పడకలో ఉండికూడా , ఎవరి ఫోన్లు వాళ్ళు చూసుకుంటూ గడిపేసే భార్యాభర్తలు .. ఇలాంటి వాటితో విపరీత పరిణామాలు సంభవించే ప్రమాదం ఉంది..
अब तक चश्मा, रुमाल, बटुआ, चाबी ही रखकर भूल जाते थे पर अब तो #MobilePhone के चक्कर मे बच्चे भी… 😅#MobileMenace & #Parenting. pic.twitter.com/g2fZhVJHUP
— Dipanshu Kabra (@ipskabra) March 26, 2022