అయ్యప్ప మాల వేసుకునే భక్తులు దాన్నొక కఠిన వ్రతంగా భావిస్తారు. తమ దీక్ష విరమించే ముందు శబరిమలై యాత్రకు పోతారు. చాలా గ్రామాలు , పట్టణాల్లో ఆధ్యాత్మిక ఇదొక సంబరంగా, జాతరగా ఉంటుంది. భక్తులు పోయే బస్సువరకు సాగనంపడం , బందు మిత్రులు పూలమాలలు వేయడం, కాళ్లకు మొక్కడం చేస్తారు. తమకు వేసిన పూలమాలలు భక్తులు బస్సుచుట్టూ కడతారు. బస్సుకు ముందు తమ యాత్రను తెలిపే బ్యానర్ ఒకటి కడతారు. .. ఇలా శబరిమల యాత్ర హంగామాకు ఇక ఫుల్ స్టాప్ పడింది.
శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళ హైకోర్టు ముఖ్యమైన సూచన చేసింది. సొంత వాహనంలో శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు తమ వాహనాలకు ఎటువంటి అలంకరణలు చేయొద్దని పేర్కొంది. ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించింది.
వాహనాలకు కొబ్బరి ఆకులు, అరటి చెట్లు, పూవులు, మాలలు అలంకరించడం వలన ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపింది. ఇలా చేయడం మోటరు వాహనాల నిబంధనలకు కూడా విరుద్ధమని కేరళ హైకోర్టు పేర్కొంది. శ్రీ అఖిల భారత అయ్యప్ప సేవ ట్రస్ట్ సభ్యులకు కూడా ఈ సమాచారాన్ని అందజేశారు.
ఇవి కూడా చదవండి..