చీకటి అంటే చాలామందికి భయం. అలాగే బల్లులు, బొద్దింకలన్నా కూడా కొంతమందికి భయం. అయితే మహిళలను చూసి భయపడేవాళ్లు, వాళ్ళకి దూరంగా 55 సంవత్సరాలుగా బతుకుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ప్రపంచంలో ఒకే ఒక్కడు ఉన్నాడు. మహిళలకు దూరంగా ఇంటి చుట్టూ 15 అడుగులు ఎత్తు ప్రహరీ గోడ కట్టుకుని ఒక్కడే ఇంట్లో జీవనం కొనసాగిస్తున్నాడు . అతడి పేరు జమ్విత. రువాండాలో ఉంటున్నాడు. ఇతడు గత 55 సంవత్సరాలుగా తనకు తాను ఒక రక్షణ కవచం ఏర్పాటు చేసుకుని ఇంట్లో ఒక్కడే ఉండిపోయాడు .
పదహారేళ్ళ వయసులో ఇంట్లో తనను తాను బంధించుకుని ఆడవాళ్లు వస్తే మూల దాక్కునేవాడు . అలా మొదలైన అతని భయం చివరకు ఇంటి చుట్టూ 15 అడుగుల ఎత్తు కంచి వేసుకుని మహిళలు ఎవరు రాకుండా ఒక్కడే ఇంటిలోనే ఉంటున్నాడు. దగ్గరకు పోవాలని అతనిని పిలిచి మాట్లాడాలని, ఇంటి చుట్టుపక్కల మహిళలు ఎంత ప్రయత్నం చేసినా వారి వల్ల కావడం లేదు. మహిళల గొంతు వింటేనే లోపలే ఉండిపోతాడు. బయట కూడా రాడు. ఒకవేళ ఎవరూ లేరు అనుకుని ఇంటి బయట తిరుగుతున్న సమయంలో మహిళలు ఎవరైనా కంచె పైనుంచి చూస్తే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటాడు.
ఇతని పరిస్థితి చూసి చాలామంది మహిళలు ఇంటి చుట్టుపక్కల వారు అతనికి కావలసిన ఆహారాన్ని ఈ 55 సంవత్సరాలు ప్రతిరోజు ఎవరో ఒకరు కంచె ఆవల నుంచి విసిరేస్తుంటారు. మహిళలు తనను చూడటం లేదని నిర్ధారించుకున్న తర్వాతనే అతడు బయటికి వచ్చి ఆహారాన్ని తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మగవాళ్ళతో చూసి మాట్లాడుతాడు తప్ప బయటకు రాడు అదే సమయంలో ఆడవాళ్ళు గనుక కనిపిస్తే మళ్లీ లోపలికి వెళ్ళిపోతాడు.
ఇతనికి ఇది చిన్ననాటి నుంచి పెరిగిన మానసికమైన జబ్బు అని వైద్యులు నిర్ధారించారు. దీన్ని మానసిక శాస్త్రంలో గైనోపోబియా అంటారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తి మహిళలను చూస్తే ఇరిటేషన్ ఫీల్ అవుతాడు.ఒక రకమైన భయం కలుగుతుంది. వాళ్లను చూస్తే ఆందోళన పెరుగుతుంది. ఇరిటేషన్ కలుగుతుంది. ఒకవేళ మహిళలు ఇతని సమీపించాలని ప్రయత్నం చేస్తే అది హార్ట్ ఎటాక్ దారి తీయవచ్చునని, కండరాలు బిగుసుకుపోవచ్చునని ,చెమటలు పట్టి శరీరం వణికి పోవచ్చునని కండరాలు బిగుసుకుపోవచ్చునని, ఆందోళనలో శ్వాస పీల్చుకోవడం కూడా కష్టం కావచ్చు నని డాక్టర్లు చెప్పారు. ప్రపంచంలో అత్యంత అరుదైన ఈ గైనోబియా వ్యాధితో బాధపడే వాళ్ళలో ఒకే ఒక్కడు అతడే జీవితం జంబిత..
ఇవి కూడా చదవండి..