రెండో భార్య 13 ఏళ్ళ కూతురిని లైంగికంగా వేధించిన ఒక పోలీసు అధికారిపై , పోక్సో చట్టంకింద కేసుపెట్టారు. వరుసకు కూతురైన బాలికను , కంటికి రెప్పలా చూసుకోవలసిన ఆ ఎస్సై కి కామంతో కళ్ళు కైపెక్కాయి.. దీంతో 13 ఏళ్ళ బాలికను లైంగికంగా వేధించాడు. నరకం చూపించాడు. దీంతో , తల్లి , తన భర్తపై కేసుపెట్టింది. బెంగుళూరులో జరిగిన ఈ ఘోరంలో ఎస్సైని పోలీసులు కేసునమోదు చేసివిచారిస్తున్నారు.
బెంగుళూరు జేసినగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఈ కామాంధుడైన ఎస్సైకి ఇదివరకే , పెళ్లయింది. ఇతడి కామచేష్టలు భరించలేక భార్య విడాకులు తీసుకుంది. తరువాత , విడాకులు తీసుకొని , బిడ్డతో ఉంటున్న మరో మహిళతో పరిచయం , ఎస్సై కి రెండో పెళ్ళికి దారితీసింది. తరువాత ఈ కామాందుడు కన్ను , రెండో భార్య 13 ఏళ్ళ కూతురుపై పడింది. ఆ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. ఇదిచాలక , రెండో భార్య చెల్లెలిపై కూడా లైంగిక వేధింపులకు పూనుకున్నాడు. దీంతో ఇతడిపై కేసు నమోదు చెయ్యాలని ఎస్పీ ఆదేశించారు.