ఈ ఏడాది రాఖీ పండుగ ఎప్పుడన్న విషయమై సంశయం నెలకొనింది. ప్రతి ఏడాది లేని డోలాయమానానికి కారణం శ్రావణ పౌర్ణమి ముందురోజు మొదలై , మరుసటి రోజువరకు కొనసాగడమే.. దీనికి తోడు భద్ర కాలం రావడంతో , చివరకు రాఖీలు కట్టే సమయం పండితులు నిర్ణయించేసారు. అదెప్పుడో చూడండి. అన్నాచెల్లెల అనుబంధానికి, అక్కాతమ్ముల ప్రేమానురాగానికి ప్రతిరూపమే రాఖీ పర్వదినం, ఈ పండుగ వస్తుందంటే చాలు..
సోదర సోదరీమణులు ఎంతో ఆత్రుతతో ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటారు. సోదరుడుకి రాఖీని కట్టి తమ అనుబంధాన్ని మరింత పదిలం చేసుకుంటారు. ప్రతిఏడాది శ్రావణమాసంలో పూర్ణిమనాడు రాఖీ పర్వదినాన్ని జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈ పూర్ణిమ రెండు రోజులు రావడంతో, ఏరోజు రాఖీ పండుగ జరుపుకోవాలని సంశయం చాలామందిలో నెలకొంది. ఈనెల 30, 31 తేదీల్లో పూర్ణిమ వచ్చింది. 30వ తేదీ పూర్ణిమ నాడు భద్రకాలం ఉంది.
చెడు కాలాన్ని భద్రకాలం అని వర్ణిస్తుంటారు. ఆ సమయంలో సోదరుడికి రాఖీ కడితే అరిష్టమని పండితులు చెబుతున్నారు. ఆగస్టు 30న ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్రకాలం ఉంటుందని, ఆ సమయంలో రాఖీ కూడా కట్టకూడదని అంటున్నారు.
30వ తేదీ రాత్రి 9గంటల 1 నిమిషం నుంచి 31వ తేదీ ఉదయం 7 గంటల 5 నిమిషాలలోపు రాఖీ కట్టించుకోవడం ఉత్తమని, అది శుభకాలమని చెబుతున్నారు. అందువల్ల రాఖీలు కట్టేవారు ఈ సమయాన్ని జాగ్రత్తగా పాటించమని చెబుతున్నారు..
ఇవి కూడా చదవండి..